9, అక్టోబర్ 2012, మంగళవారం

ధరణికి గిరి భారమా - మంచి మనసుకు మంచి రోజులు నుండి

చిత్రం: మంచి మనసుకు మంచి రోజులు (1958)

రచన: సముద్రాల జూనియర్

సంగీతం: ఘంటసాల

గానం: రావుబాలసరస్వతీదేవి

పల్లవి: ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా?

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

చరణం: మును నే నోచిన నా నోము పండగా

నా వడిలో వెలిగే నా చిన్ని నాయనా

పూయని తీవెననే అపవాదు రానీక - 2

తల్లిననే దీవెనతో తనియించినావయ్య

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా?

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

చరణం: ఆపద వేళల అమ్మమనసు చెదరునా

పాపల రోదనకే ఆ తల్లి విసుగునా

పిల్లల కనగానే తీరేనా స్ర్తీ విధి - 2

ప్రేమగా పాపలను పెంచనిదొక తల్లియా?

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా?

తరువుకు కాయ భారమా? కనిపెంచే తల్లికి పిల్ల భారమా?

Thanks to anvitap for providing the video and You Tube for hosting the video.

1 కామెంట్‌:

  1. నిజం సూరి గారు, ఎంతో భావం ఉన్న పాట.
    నీను ఈ చిత్రాన్ని తమిళం లో చూసాను.
    చిత్రం పేరు తై పిరందాల్ వళి పిరక్కుం
    బహుశా 1958 లోనే, చెన్నై లోని వెల్లింగ్టన్ టాకీస్ లో.
    నాకి చాలా ఇష్టమైన పాట కూడా.

    రిప్లయితొలగించండి

Blog Indices