8, అక్టోబర్ 2012, సోమవారం

తల్లిని మించి ధారుణి వేరే - అభిమానం చిత్రం నుండి జిక్కీ చక్కని పాట

తల్లిని మించిన దైవం ఈ ప్రపంచంలో మరొకటి లేనే లేదు. మనం పుట్టిన భూమాత, మనను పోషించే గోమాత, మనం ప్రతి ఉదయం నమస్కరించే తులసీమాత, మనను పరిరక్షించే వేదమాత, ఇలా మాత అనే తల్లి మనను కాస్తుంది, కాపాడుతుంది. తల్లి నిర్వహించే గొప్పదైన విద్యుక్త ధర్మాన్ని ముగ్గురు మాతలనూ ప్రస్తావిస్తూ, వారి గొప్పదనాన్ని ప్రస్తుతిస్తూ మహాకవి శ్రీ శ్రీ ఈ పాటలో వ్రాయగా, దానికి ఘంటసాల సంగీత దర్శకత్వంలో, అభిమానం చిత్రం కోసం, జిక్కీ (కృష్ణవేణి) పాడారు. ఇది ఒక మరపురాని మధురమైన పాట.





చిత్రం: అభిమానం (1960)

రచన: శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ)

సంగీతం: ఘంటసాల వెంకటేశ్వర రావు 

గానం: కృష్ణవేణి (జిక్కీ)





పల్లవి: తల్లిని మించి ధారుణి వేరే దైవము లేనే లేదుగా


చల్లని తల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గముగా | తల్లిని |





చరణం: చేరగ వచ్చే లేగను చూచి కోరిక తీరగా


దరి చేరగ వచ్చే లేగను చూచి కోరిక తీరగా


కడు తియ్యని పాలు తాగించి మురిసే గోమాత మా జననీ | తల్లిని |





చరణం: తీగెలనిండి పూచిన మల్లి పూవుల తావితో


ఎల తీగెలనిండి పూచిన మల్లి పూవుల తావితో


అనురాగములొలికే, ఆనందమొసగే భూమాత మా జననీ | తల్లిని |





చరణం: ఇంటను వెలసి, కంటను మెరిసే ఈ తులసీ సతీ


మా యింటను వెలసి, కంటను మెరిసే ఈ తులసీ సతీ


కలకాలము బ్రోచే, కష్టాలు మాపీ పాలించు మా జననీ


తల్లిని మించి ధారుణి వేరే దైవము లేనే లేదుగా


చల్లని తల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గముగా


చల్లని తల్లి దీవెనలున్న ఇల్లే స్వర్గముగా

Thanks to Narasimharajuveera for providing the you tube video

4 కామెంట్‌లు:

Blog Indices