1, నవంబర్ 2012, గురువారం

చెంగు చెంగునా గంతులు వెయ్యండి, ఓ జాతివన్నె బుజ్జాయిల్లారా!

అలనాటి అందమైన తెలుగు పాట "చెంగు చెంగునా గంతులు వేయండి". ఈ పాట నమ్మినబంటు (1960) చిత్రంలోనిది. ఇందులో కొన ఊపిరి వున్న దూడను పారేయమని యజమాని (గుమ్మడి) తన పాలేరు (ఎస్.వి.ఆర్.) కు చెబుతాడు. అపుడు ఆ పాలేరు కూతురు (సావిత్రి) దానిని బతికించుకుంటానని మందు వేసి ప్రాణం నిలుపుతుంది. నోరులేని ఈ తువ్వాయిలు మన సంపదను పెంచే రత్నాలు, తెలుగు తల్లికి ముద్దు బిడ్డలని చక్కని పాటను వ్రాయగా దానికి ్టర్ వేణియజేశ్వావబాణీ కట్టారు. ఈ పాట ి.ుశ గొంతులో వినండి. 



Thanks to Kishor Vivian for loading the video in you tube.



పల్లవి: చెంగు చెంగునా


చెంగు చెంగునా గంతులు వేయండి


జాతివన్నె బుజ్జాయిల్లారా, నోరులేని తువ్వాయిల్లారా


చెంగు చెంగునా


చెంగు చెంగునా గంతులు వేయండి





చరణం: రంగురంగుల ఓపరాలతో, రంకెలు వేసే రోజెపుడో


చెక చెక మంటూ అంగలు వేసి, చేలను దున్నే అదనెపుడో


కూలిపోయినా సంసారానికి, గోకింతా పెట్టే దెపుడో | కూలిపోయినా|


ఆశలన్ని మీమీద బెట్టుకొని తిరిగే మా వెతలణగే దెపుడో | చెంగు చెంగునా |





చరణం: పంచభక్ష్య పరమాన్నం తెమ్మని బంతిని గూర్చుని అలగరుగా


పట్టుపరుపులను వేయించండని పట్టుబట్టి వేధించరుగా


గుప్పెడు గడ్డితో క్కెడు నీళ్ళతో తృప్తిచెంది తలలూగిస్తారూ


జాలిలేని నరపశువుల కన్న మీరే మేలనిపిస్తారూ | చెంగు చెంగునా |





చరణం: పగలనకుండా, రేయనకుండా పరోపకారం చేస్తారూ


వెన్నుగాచి మీ యజమానులపై విశ్వాసం పిస్తారూ


తెలుగుతల్లికి ముద్దుబిడ్డలు, సంపద పెంచే జాతిరత్నములు


మా ఇలవేల్పులు మీరు లేనిదే మానవజాతికి బ్రతుకే లేదు | చెంగు చెంగునా |

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Indices