10, జులై 2017, సోమవారం

కనులకు దోచి చేతికందని - బాటసారి నుండి జిక్కీ, భానుమతి






చిత్రం: బాటసారి 

గాయకులు: పి.జి.కృష్ణవేణి ( జిక్కి), పి. భానుమతి 

సంగీతం: మాస్టర్ వేణు (మద్దూరి వేణుగోపాల్)

రచన: సముద్రాల రాఘవాచార్య




జిక్కీ: కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్ 


సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని 


కనులకు దోచి చేతికందని ఎండమావులున్నయ్ 


సోయగముండి సుఖము నోచని బ్రతుకులున్నవి కొన్ని 


భూమిజనించి ఆకలి కొదగని ఫలములున్నవి కొన్ని -2


మనసున నిండి పలుకగరాని తలపులున్నవి కొన్ని 


తలపులున్నవి కొన్ని 


సృష్టి చేసినది దేవుడైన మరి నాశము నేల సృజించే 


పలుకు నొసగినది దేవుడైన మరి మూగలనేల సృజించే 


కనుల నొసగినది దేవుడైన మరి అంధులనేల సృజించే -2


వెలుగునిచ్చినది దేవుడైన మరి చీకటినేల సృజించే 


పెను చీకటినేల సృజించే 

భానుమతి: వేద శాస్త్రములు చదివినవారే ఎరుగరు సృష్టి విలాసం -2


అల్పబుద్దితో జ్ఞానదాతనే సలుపకు పరిహాసం ... 


సలుపకు పరిహాసం 


బ్రతుకంతా పలు ప్రశ్నలమయమై బ్రతుకును జనసముదాయం 


బదులు కోసమై వెదకుటమాని బ్రతుకుటయే న్యాయం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Indices