28, జూన్ 2016, మంగళవారం

ఇటుఅటు కాని హృదయంతోటి - ఇది కథ కాదు నుండి బాలు, రమోల పాడిన చక్కని పాట





చిత్రం: ఇది కథ కాదు
గీతం: ఆత్రేయ
స్వరం: యం.యస్. విశ్వనాథన్ 
గానం: బాలు, రమోల
పల్లవి: బాలు: జూనియర్.. జూనియర్.. జూనియర్...
రమోల: Yes Boss
బాలు: ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు -2
అటు ఇటు తానొక ఆటబొమ్మనీ తెలిసే ఎందుకు వలచేవు -2
ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ..
రమోల: గడ్డిపోచా? నేనా? హి హి హి హి..
బాలు: ఒడ్డున పెరిగే గడ్డిపోచవూ ఒద్దిక నదితో కోరేవు...
రమోల: ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు వుండకూడదు
వుందని ఎందుకు ఒప్పుకోరాదు...
రబ్బరు బొమ్మకు రాగం తెలుసు ఆటబొమ్మకు ఆశలు తెలుసు
ఇద్దరు ఒక్కటి ఎందుకు కారాదు..
బాలు: జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు...
చరణం: బాలు: సాగరమున్నా తీరనిదీ నీ దాహమురా..
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా..
రమోల: నీ మొహమురా హి హి హి హి హి...
బాలు: సాగరమున్నా తీరనిది నీ దాహమురా..
కోకిలగానం కాకి పాడితే ద్రోహమురా..
తీగకు పందిరి కావలెగానీ తెలుసా నువ్వే పందిరని -2
రమోల: నీటిని చూసి దాహమువేస్తే తేనెకోసం తేటి వస్తే
పాపం గీపం అనడం ఛాదస్తం 
బాలు: No it's bad...
రమోల: But I am mad...
మోడు కూడ చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం
బాలు: హ హ హ హ
రమోల: what పక పక పిక పిక.. హూ...
బాలు: జూనియర్..
రమోల: ఊ...
బాలు: జూనియర్ జూనియర్ జూనియర్
ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు...
చరణం: బాలు: చైత్రములోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
రమోల: Boss, Love has no season, not even reason
బాలు: Shut up
చైత్రములోన చినుకు పడాలని కోరేవు
మార్గశిరాన మండుటెండకై చూసేవు
ఉదయంకోసం పడమర తిరిగి ఎదురుతెన్నులు కాచేవు -2
రమోల: ఎండా వాన కలిసొస్తాయి
వెలుగు చీకటి కలిసుంటాయి
జరగని వింతలు ఎన్నో జరిగాయి
బాలు: It is highly idiotic
రమోల: No boss, it is fully romantic
హ హ హ హ 
పాట పాడెను ముద్దుల బొమ్మ
పక పక నవ్వేవెందులకమ్మా
మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా
మనసున వున్నది చెప్పీ నవ్వమ్మా
బాలు: ఇటు అటు కాని హృదయంతోటి ఎందుకురా ఈ తొందర నీకు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Indices