25, జూన్ 2016, శనివారం

నవ్వులు రువ్వే పువ్వమ్మా - బాలు అద్భుతమైన గీతం, గాజుల కిష్టయ్య నుండి









చిత్రం:  గాజుల కిష్టయ్య (1975)


సంగీతం: కె. వి. మహదేవన్


రచన: ఆచార్య ఆత్రేయ


గాన: బాలు






పల్లవి : నవ్వులు రువ్వే పువ్వమ్మా..



నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా



ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా



నవ్వులు రువ్వే పువ్వమ్మా..



నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా.. పువ్వమ్మా






చరణం: ఆకుల పయ్యెదలో నీ ఆడతనాన్ని దాచావు



రేకుల కెంపులలో నీ రేపటి ఆశలు నింపావు



ఆ ముసుగు తీసిన ముద్దు ముఖాన.. మొగ్గ సొగసే ఉందమ్మా



నవ్వులు రువ్వే పువ్వమ్మా..



నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా...  పువ్వమ్మా






చరణం: ఈ తోట మొత్తము కమ్మినవి.. నీ దోర వయసు అందాలు



ఈ గాలి మత్తులో ఉన్నవి.. నీ కన్నె మనసులో కైపులు



ఈ తోట మొత్తము కమ్మినవి.. నీ దోర వయసు అందాలు



ఈ గాలి మత్తులో ఉన్నవి.. నీ కన్నె మనసులో కైపులు



నువ్వొలకబోసే ఒ౦పు సొంపులకు ఒడిని పడతానుండమ్మా



నవ్వులు రువ్వే పువ్వమ్మా..



నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా.. పువ్వమ్మా






చరణం: ఏ కొమ్మకు పూచావో ఏ కమ్మని తేనెలు తెచ్చావో



ఏ పాటకు మురిసేవో ఏ తేటికి విందులు చేసేవో



ఆ పాటగానో తేటిగానో పదినాళ్ళున్నా చాలమ్మా    



నవ్వులు రువ్వే పువ్వమ్మా.. నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా



ఉన్న నాలుగు నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా



నవ్వులు రువ్వే పువ్వమ్మా..



నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా పువ్వమ్మా






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Indices