22, జూన్ 2016, బుధవారం

నేనొక ప్రేమ పిపాసిని - ఇంద్ర ధనుస్సు నుండి ఆత్రేయ కలం, బాలు గళం, మామ స్వరం




చిత్రం: ఇంద్ర ధనుస్సు (1978)
రచన: ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్‌
గానం: బాలు
పల్లవి: నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి 
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది 
నేనొక ప్రేమ పిపాసిని - నీవొక ఆశ్రమవాసివి 
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది
నేనొక ప్రేమ పిపాసిని..
చరణం:  తలుపు మూసిన తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా
పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా 
తలుపు మూసినా తలవాకిటనే - పగలు రేయి నిలుచున్నా 
పిలిచి పిలిచీ బదులేరాక - అలసి తిరిగి వెళుతున్నా 
నా దాహం తీరనిది - నీ హృదయం కదలనిది 
నేనొక ప్రేమ పిపాసిని..
చరణం:  పూట పూట నీ పూజ కోసమని - పువ్వులు తెచ్చాను 
ప్రేమభిక్షను పెట్టగలవని - దోసిలి ఒగ్గాను 
నీ అడుగులకు మడుగులొత్తగా - ఎడదను పరిచాను 
నీవు రాకనే అడుగు పడకనే - నలిగిపోయాను 
నేనొక ప్రేమ పిపాసిని.. 
చరణం:  పగటికి రేయి - రేయికి పగలు - పలికే వీడ్కోలు 
సెగ రేగిన గుండెకు చెబుతున్నా - నీ చెవిన పడితే చాలు 
నీ జ్ఞాపకాల నీడలలో నన్నెపుడో చూస్తావు 
నను వలచావని తెలిపేలోగా - నివురైపోతాను..


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Indices