| చిత్రం: | మనుషులు మారాలి (1969) | |
| రచన: | శ్రీశ్రీ | |
| సంగీతం: | కె.వి. మహదేవన్ | |
| గానం: | బాలు, సుశీల | |
| పల్లవి: | బాలు: | తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో |
| ఉదయ రాగం హృదయ గానం -2 | ||
| ఇద్దరు | తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో | |
| సుశీల: | ఉదయ రాగం హృదయ గానం -2 | |
| బాలు: | మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం | |
| సుశీల: | మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం | |
| ఇద్దరు | తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో | |
| ఉదయ రాగం హృదయ గానం -2 | ||
| చరణం: | సుశీల: | వేల వేల వత్సరాల కేళిలో మానవుడుదయించిన శుభవేళలో -2 |
| వీచె మలయ మారుతాలు పుడమి పలికె స్వాగతాలు | ||
| మాలికలై తారకలె మలిచె కాంతి తోరణాలూ | ||
| బాలు: | ఓహో | |
| ఇద్దరు | తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో | |
| ఉదయ రాగం హృదయ గానం -2 | ||
| చరణం: | బాలు: | వలపులోన పులకరించు కన్నులతో |
| చెలిమి చేరి పలుకరించు మగవారూ | ||
| మనసులోన పరిమళించు వెన్నెలతో | ||
| ప్రియుని చూచి పరవశించె ప్రియురాలూ | ||
| సుశీల: | జీవితమే స్నేహమయం ఈ జగమే ప్రేమమయం | |
| బాలు: | ప్రేమంటే ఒక భోగం | |
| సుశీల: | కాదు కాదు అది త్యాగం | |
| బాలు: | ఓ హో | |
| ఇద్దరు: | తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో | |
| ఉదయ రాగం హృదయ గానం -2 |
20, జూన్ 2016, సోమవారం
తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో - మనుషుల మారాలి - బాలు, సుశీల
లేబుళ్లు:
కె.వి.మహదేవన్,
బాలు-సుశీల,
మనుషులు మారాలి-1969,
శ్రీశ్రీ
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)






కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి