పాట పొందుపరచిన శారదా ఆకునూరి గారికి ధన్యవాదాలు
| చిత్రం: | దానధర్మాలు (1976) | ||
| సంగీతం: | మాస్టర్ వేణు | ||
| రచన: | కొండిసెట్టి శ్రీరామా రావ్ | ||
| గానం: | సుశీల, బాలు | ||
| పల్లవి : | సుశీల: | నీలాల నింగిలోన పగడాల పందిరి వేసి | |
| రతనాల రంగులతో.. ముత్యాల ముగ్గులు వేద్దామా | |||
| ముత్యాల ముగ్గులు వేద్దామా... | |||
| చరణం: | బాలు: | పుష్పరాగములతో.. పొదిగిన పచ్చలతో -2 | |
| కెంపులతో సొంపుగనూ | |||
| వజ్రాల వంపులు తీర్చిన.. ఆ వయ్యారి భామవు నీవే.. వరసైన చినదాన | |||
| సుశీల: | వరసైనదానిని కాను.. ఆ సిసలైన దానిని నేను | ||
| సిగ్గు తెర తీసి చెప్పాను నేను చేసుకుంటాను నిన్నేననీ | |||
| బాలు: | ఒప్పుకుంటే కదా నిన్ను నేను... చేశారు ఈ పెళ్ళి మనకు | ||
| సుశీల: | మూడుముళ్ళు విప్పిన కూడా పోలేవు ముందుకు నీవు... | ||
| పోలేవు ముందుకు నీవు... | |||
| చరణం: | బాలు: | మనసైన మగువతో మాటాడకుండ లేను...2 | |
| నిన్ను విడిచి నిముషమైన నిలువలేను ఈ జగాన | |||
| సుశీల: | ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. | ||
| ప్రేమగ చూస్తే చాలు నీ పాద పూజ చేస్తాను | |||
| జన్మజన్మాలకైనా నిన్నే కోరుకుంటాను... నిన్నే కోరుకుంటాను... | |||
| ఇద్దరు: | నీలాల నింగిలోన పగడాల పందిరి వేసి | ||
| రతనాల రంగులతో.. ముత్యాల ముగ్గులు వేద్దామా |







కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి