23, మార్చి 2012, శుక్రవారం

ఉగాది నాడు - ఆమనీ పాడవే హాయిగా

1989 లో వచ్చిన చక్కని ప్రేమ కథా చిత్రం గీతాంజలి. అబ్బో దాదాపు 23 సంవత్సరాలయింది.  హీరోయినుగా వేసిన అమ్మాయి గిరిజ (గీతాంజలి షెట్టార్) బహుశా చాల తక్కువ చిత్రాలలో నటించిందనుకుంటా. నాగార్జున అప్పుడే నిలదొక్కు కుంటున్నాడు. శ్రీ ఇళయరాజా గారి సంగీతం చిత్రానికి ఆయువు పట్టు. అయితే పెద్ద పీట వేయవలసినది శ్రీ వేటూరి సుందర రామ్మూర్తి గారికి కూడ. గోపాలా "మసజసతతగ శార్దూలా" అని తెలుగు ఛందస్సు సూత్రాన్ని కూడ పాటలో దించి ఎప్పుడో స్కూలులో చదివిన మన తెలుగును మనకు గుర్తు చేసి, కాదేదే కవిత కనర్హం అని శ్రీశ్రీ గారన్నట్టు చక్కని పాటలు వ్రాసారు. నిజంగా చేతులెత్తి నమస్కరించవలసిన మహానుభావుడు.

నందన నామ సంవత్సర శుభాకాంక్షలు!

                           ప.  ఆమని పాడవే హాయిగా, మూగవై పోకు ఈ వేళ
                                 రాలేటి పూల రాగాలతో, పూసేటి పూల గంధాలతో
                                 మంచు తాకి కోయిల మౌనమైన వేళలా                   ॥ ఆమనీ

 
                           చ.  వయస్సులో వసంతమే ఉషస్సులా జ్వలించగా
                                 మనస్సులో నిరాశలే రచించెలే మరీచిక
                                 పదాల నా ఎద, స్వరాల సంపద
                                 తరాల నా కథ క్షణాలదే కదా
                                 గతించి పోవు గాధ నేనని                                        ॥ ఆమనీ ॥
 

                           చ. శుకాలతో, పికాలతో ధ్వనించిన మధూదయం
                                దివీ-భువీ కలా-నిజం స్పృశించిన మహోదయం
                                మరో ప్రపంచమే మరింత చేరువై
                                నివాళి కోరిన ఉగాది వేళలో
                                గతించి పోని గాధ నేనని                                           ॥ ఆమనీ ॥

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Indices