13, ఏప్రిల్ 2012, శుక్రవారం

లక్ష్మి స్థిరంగా ఉండాలంటే చేయకూడని పనులేమిటి?

ఎప్పుడో 1970 లో విడుదలయిన చిత్రం లక్ష్మీ కటాక్షం.  ఇందులో ఎన్నో చక్కని పాటలున్నాయి. అందులో ప్రత్యేకమైనది ఈ శుక్రవార మహిమ గురించి చెప్పే పాట. నిజంగా మన పూర్వీకులు ఎంతో ఆలోచించి చెప్పేరు. మన దైనందిన జీవితంలో ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా, మనము పాటించవలసినవి, మన కర్తవ్యాన్ని నిర్వర్తించవలసినవి ఎన్నో ఉన్నాయి. వాటిని చక్కని పాట లేదా పద్య రూపంలో చెబితే సులభంగా గుర్తు వుంటుంది.  అటువంటి కోవకు చెందుతుంది ఈ పాట. ఇది శ్రీ చిల్లర భావనారాయణ గారి రచన. పాడినది శ్రీమతి ఎస్.జానకి గారు. ఈ పాటలో ఎన్‌.టి.ఆర్. చక్కని ముఖకవళికలు ప్రదర్శించారు. 


.

చిత్రం: లక్ష్మీ కటాక్షం 
రచన: చిల్లర భావనారాయణ 
సంగీతం: ఎస్.పి.కోదండపాణి
గానం: ఎస్.జానకి




శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు 

దివ్వె నూదగ వద్దు, బువ్వ నెట్టొద్దు 

తోబుట్టువుల మనసు కష్ట పెట్టొద్దు 

తొలి సంజె, మలి సంజె నిదురపోవద్దు 

మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు  | మా తల్లి |




ఇల్ల్లాలు కంటతడి పెట్టనీ యింట 

కల్లలాడని యింట గోమాత వెంట 

ముంగిళ్ళ ముగ్గుల్లో, పసుపు గడపల్లో

పూలల్లో.. పాలల్లో..

పూలల్లో, పాలల్లో, ధాన్య రాశుల్లో

మా తల్లి మహలక్ష్మి స్థిరముగా నుండు  | మా తల్లి |

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Indices