1, ఫిబ్రవరి 2012, బుధవారం

నారాయణ మంత్రం - భక్త ప్రహ్లాద నుండి

ఆనాడూ, ఈనాడూ పిల్లలకు అమితంగా నచ్చిన చిత్రం ఒకప్పుడు బాలనటి రోజారమణి ప్రహ్లాదుడుగా నటించిన భక్త ప్రహ్లాద (1967) చిత్రం. హిరణ్య కశిపునిగా ఎస్.వి.ఆర్. అతని భార్య లీలావతిగా అంజలీదేవి, నారదునిగా శ్రీ బాలమురళీకృష్ణ  నటించిన ఈ చిత్రంలో ఎన్నో మంచి పాటలున్నాయి. అందులో శ్రీమతి పి.సుశీల, బృందం పాడిన "నారాయణ మంత్రం" పాట నాకెంతో యిష్టం. ఈ దృశ్యంలో ప్రహ్లాదుని గురువులుగా రేలంగి, పద్మనాభం నటించారు. ఈ పాట దృశ్య, సాహిత్యాలను ఇక్కడ ఇస్తున్నాను.
చిత్రం: భక్త ప్రహ్లాద  (1967)
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
గానం: పి.సుశీల, బృందం 
రచన: సముద్రాల జూనియర్  

 
సాకీ:  ఓం నమో నారాయణాయ....ఓం నమో నారాయణాయ
         ఓం నమో నారాయణాయ....ఓం నమో నారాయణాయ
         ఓం నమో నారాయణాయ....ఓం నమో నారాయణాయ
ప:     నారాయణ మంత్రం శ్రీ మన్నారాయణ భజనం (2)
         భవ బంధాలు పారద్రోలి పరము నొసంగే  సాధనం
         నారాయణ మంత్రం శ్రీ మన్నారాయణ భజనం (2)

చ:    
గాలిని బంధించి హఠించి గాసిల పనిలేదు (2)
         జీవుల హింసించి క్రతువుల చేయగ పని లేదు (2)
         మాధవా మధుసూదనా అని మనసున తలచిన చాలుగా (2)
         నారాయణ మంత్రం శ్రీ మన్నారాయణ భజనం (2)

చ.     తల్లియు తండ్రియు నారాయణుడే
         గురువూ చదువూ నారాయణుడే
         యోగము యాగము నారాయణుడే
         ముక్తియు దాతయు నారాయణుడే
         భవ బంధాలు పారద్రోలి పరము నొసంగే సాధనం
         నారాయణ మంత్రం శ్రీ మన్నారాయణ భజనం         (2)
         నాద హరే శ్రీ నాద హరే నాద హరే జగన్నాథ హరే     (2)

         నాద హరే శ్రీ నాద హరే         (2)
         నాద హరే జగన్నాథ హరే     (2)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Indices