1, ఫిబ్రవరి 2012, బుధవారం

రావోయి చందమామ - రంగుల్లో


అలనాటి మిస్సమ్మ (1955) అనగానే ఎవరికయినా ముందుగా గుర్తుకు వచ్చే పాట శ్రీమతి పి. లీల, ఎ.ఎం.రాజా కలసి పాడిన "రావోయి చందమామా". నలుగురు మహా నటులు ఎన్.టి.ఆర్., సావిత్రి, ఎ.ఎన్.ఆర్. ఎస్.వి.ఆర్. నటించిన మణిహారం మిస్సమ్మ. చక్కని భావ ప్రకటనకు పెట్టింది పేరు సావిత్రి గారు. ముఖంలో అన్ని భావాలను అలవోకగా చూపించగల మహానటి ఆమె.  పింగళి నాగేంద్ర రావు గారి రచన, ర'సాలూరు' రాజేశ్వర రావు గారి స్వర రచన, చక్కని గాయనీ గాయకుల సమ్మేళనం, తగినంత హాస్యం అన్నీ చక్కగా కుదిరిన విజయా సంస్థ యొక్క అద్భుత చిత్రం "మిస్సమ్మ".  రంగుల్లో "రావోయి చందమామ"ను చూడండి.


Color

Black & White



A.M.రాజా:    రావోయి చందమామా మా వింత గాధ వినుమా          | రావోయి |
               రావోయి చందమామా
               సామంతము గల సతికీ ధీమంతుడనగు పతినోయ్       | సామంతము |
               సతి పతి పోరే బలమై సతమతమాయెను బ్రతుకే
లీల:          రావోయి చందమామా మా వింత గాధ వినుమా          | రావోయి |
               రావోయి చందమామా
               ప్రతినలు పలికిన పతితో బ్రతుకగ వచ్చిన సతినోయ్      | ప్రతినలు |
               మాటలు బూటకమాయే నటనలు నేర్చెను చాలా
A.M.రాజా:    రావోయి చందమామా మా వింత గాధ వినుమా          | రావోయి |
               రావోయి చందమామా
               తన మతమేమొ తనదీ మన మతమసలే పడదోయ్     | తన మతమేదో |
               మనమూ మనదను మాటె అననీయదు తాననదోయ్
లీల:          రావోయి చందమామా మ వింత గాధ వినుమా           | రావోయి |
               రావోయి చందమామా
               నాతో తగవులు పడుటే అతనికి ముచ్చటలేమో           | నాతో తగవులు |
               ఈ విధి కాపురమెటులో నీవొక కంటను గనుమా
ఇద్దరు:       రావోయి చందమామా మా వింత గాధ వినుమా
               రావోయి చందమామా

2 కామెంట్‌లు:

Blog Indices