1955 లో విడుదలైన "రోజులు మారాయి" శ్రీమతి వహీదా రెహమాన్ కు నట జీవితంలోనే మొదటి చిత్రం. ఈ చిత్రంలో జిక్కీ పాడిన "ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా" అలనాటి మేటి సూపర్ డూపర్ పాట. దుక్కి దున్ని నాట్లువేసే సమయాన్ని "ఏరువాక" అంటారు. తొలి చిత్రమైనా వహీదా నటన, నృత్యం అద్భుతం. ఈ పాటలో చాల చలాకీగా కనిపిస్తుంది ఆమె. హైదరాబాదుకు చెందిన ఈమె చిన్నప్పుడే భరత నాట్యం నేర్చుకుంది. పల్లెటూర్ల లోని రాజకీయాలను ప్రతిబింబిస్తూ తీసిన చిత్రమిది. 'భూస్వాముల అక్రమాలకు అడ్డుకట్ట వేసే కాలం దగ్గర పడింది, రోజులు మారాయి' అని ప్రబోధించే చక్కని గీతాన్ని పల్లెటూరి యాసను ఉపయోగించి కొసరాజు గారు చక్కగా వ్రాసారు. దానికి డప్పుల మోతతో, గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ సంగీత దర్శకులు మాస్టర్ వేణు (ఇతని కుమారుడే నటుడు భానుచందర్) అందించిన మధురమైన బాణీ ఇది.
మాస్టర్ వేణు జిక్కీ వహీదా రెహమాన్ |
సంగీతం: మాస్టర్ వేణు
గానం: జిక్కీ (కృష్ణవేణి)
ఓ.. ఓ.. ఓ.. ఓ..
సాకీ. కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా | కల్లా కపటం |
ప. ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
చ. నవధాన్యాలను గంపకెత్తుకుని
చద్ది యన్నము మూటగట్టుకుని
ముల్లుగర్ర నువు చేత బట్టుకుని
ఇల్లాలును నీ వెంటబెట్టుకుని | ఏరువాకా సాగారో |
చ. పడమట దిక్కున వరద గుడేసె
ఉరుముల మెరుపుల వానలు కురిసె | పడమట దిక్కున |
వాగులు వంకలు వురవడి జేసె
ఎండిన బీళ్ళు చిగుళ్ళు వేసె | ఏరువాకా సాగారో |
చ. కోటేరును సరిజూసి పన్నుకో
యెలపట దాపట యెడ్ల దోలుకో
సాలు తప్పక కొంద వేసుకో
యిత్తనమ్ము యిసిరిసిరి జల్లుకో | ఏరువాకా సాగారో |
చ. పొలాలమ్ముకుని పోయేవారు
టౌనులొ మేడలు కట్టేవారు
బ్యాంకులొ డబ్బు దాచేవారు
ఈ తట్టిని గమనించరు వారు | ఏరువాకా సాగారో |
చ. పల్లెటూళ్ళలో చల్లనివాళ్ళు
పాలిటిక్సుతో బ్రతికేవాళ్ళు
ప్రజాసేవయని అరచేవాళ్ళు | ప్రజాసేవయని |
ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు | ఏరువాకా సాగారో |
చ. పదవులు స్థిరమని భ్రమిసేవాళ్ళే
ఓట్లు గుంజి నిను మోసేవాళ్ళే
నీవే దిక్కని వత్తురు పదవో | నీవే దిక్కని |
రోజులు మారాయ్! రోజులు మారాయ్!
మారాయ్! మారాయ్! రోజులు మారాయ్! | ఏరువాకా సాగారో |
chakkani paata..!! cinema release ki mundu..ii paatani cut cheseddamanukunnarata..!! mottaniki mana adrushtam..aa pani jaragaledu..!!
రిప్లయితొలగించండికేసరి గారు, ధన్యవాదాలు. నిజంగా అదృష్టమే ఈ పాట తీయకుండా ఉంచినందుకు. వహీదా రహమాన్ ఈ పాటలో మాత్రమే నటించింది. ఇది ఆవిడ తొలి చిత్రం. అద్భుతమైన నటన. మనం మిస్సయేవాళ్ళం.
రిప్లయితొలగించండిభలే పాట గురువుగారూ ! అందించినందుకు ధన్యవాదాలు ! :-)
రిప్లయితొలగించండిఫణీ, ధన్యవాదాలు.
తొలగించండి