2, అక్టోబర్ 2012, మంగళవారం

బలే తాత మన బాపూజీ, బాలల తాత బాపూజీ


నేడే గాంధీ జయంతి


చిత్రం: దొంగ రాముడు (1955)
రచన: సముద్రాల రాఘవాచార్య 
సంగీతం:  పెండ్యాల నాగేశ్వరరావు 
గానం: పి.సుశీల, బృందం



పల్లవి: సుశీల: బలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ

బృందం: బలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ

సుశీల: బోసి నవ్వులా బాపూజీ, చిన్నీ పిలకా బాపూజీ

బృందం: బలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ



చరణం: సుశీల: కుల, మత భేదం వలదన్నాడు, కలిసి బతికితే బలమన్నాడు 


మానవులంతా ఒకటన్నాడు, మనలో జీవం పోసాడు 

బృందం: బలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ



చరణం: సుశీల: నడుము బిగించి లేచాడు, అడుగు ముందుకు వేసాడు 


కదం తొక్కుతూ, పదం పాడుతూ దేశం దేశం కదిలింది 


గజగజలాడెను సామ్రాజ్యం, మనకు లభించెను స్వారాజ్యం


మనకు లభించెను స్వారాజ్యం

బృందం: బలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ



చరణం: సుశీల: సత్యాహింసలె శాంతి మార్గమని జగతికి జ్యోతిని చూపించాడు 


మానవ ధర్మం బోధించాడు ఆ..ఆ..ఆ..


మానవ ధర్మం బోధించాడు, మహాత్ముడై యిల వెలిసాడు 

బృందం: బలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ


బలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ


బలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Indices