4, అక్టోబర్ 2012, గురువారం

సుశీల పాడిన, ఆరుద్ర రాసిన అతి చిన్న పాట

సంగీత దర్శకుడు సమర్ధుడైతే, ప్రతిభ గల గాయని పాట అందుకుంటే పల్లవే ప్రాణమై నిలుస్తుంది పాటకు. మరి చరణాలతో పని వుండదు. ఆకాశం నుంచి జారిన ఊయల, దాంట్లో సోయగం జాలువారే సుందరి మోహిని రాగాలాపన చేస్తూ, అమర గానంలో పరిసరాలు మరచిపోయినట్లు నటిస్తూ, భూమి గుండ్రంగా తిరిగినా, భువినంటి మింటికెగసినా, దివినుండి భూమిపైకి దూకినా, ఏమీ జరగనట్లు భస్మాసురుని కై దొంగ చూపులు చూస్తూ పాడే ఈ సన్నివేశం మోహినీ భస్మాసుర చిత్రంలోనిది.  తాను ఎవరి తలపై చేయి పెడితే వాళ్ళు భస్మమైపోవాలన్న వరం పొంది విర్రవీగుతున్న భస్మాసురుని అంతమొందించాలని విష్ణువు మోహినీ రూపం తో సమ్మోహింపజేసే ఘట్టం యిది. బహుశ ఆరుద్ర వ్రాసిన లేదా తెలుగు చిత్రసీమలోనే ఇది అతి చిన్న పాటేమో! ఈ చిత్రంలో ఎస్.వి.రంగారావు భస్మాసురునిగా, పద్మిని మోహినిగా నటించారు.
తియ్యనైన ఊహలా తేలి తేలి ఊగెదా.. 

Thanks to PlayEven Music for providing the you tube video.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Indices