20, ఫిబ్రవరి 2012, సోమవారం

ఓం నమః శివ రూపాయ - శివరాత్రి శుభాకాంక్షలు

శివరాత్రి శుభాకాంక్షలు
మనిషిని నడిపించే నమ్మకమే దైవం.  ఆ దైవానికి ఒక రూపం అంటూ లేదు, ఏ రూపం తోనైనా కొలవచ్చును భగవంతుడిని. అయితే కొందరి దృష్టిలో దేవుడనేవాడు అసలు రూపమే లేని నిరాకారుడు. త్రిమూర్తులలో పరమశివుడు లయకారుడు. అతడొక తాపసి, సన్యాసి, దిగంబరుడు, నీలగ్రీవుడు. శివునిపై ఎన్నో స్తోత్రాలు, అష్టకాలు, గీతాలు, భజనలు వున్నాయి. అయితే సినిమాకు అనుగుణంగా ఒక భక్తి గీతాన్ని ఒక ప్రత్యేకమైన శైలిలో శ్రీ రామ జోగయ్య శాస్త్రి గారు "ఖలేజా" చిత్రానికి "ఓం నమో శివ రుద్రాయ" అనే పాట రూపంలో వ్రాయగా దాన్ని ప్రజలు మెచ్చే బాణీతో సంధించారు సంగీత దర్శకులు మణిశర్మ గారు. చిరంజీవులు కారుణ్య, రమేష్ లు అద్భుతంగా పాడారు.  ఒక మారుమూల పల్లెలో, ఎవరో ఒక దేవుడు వచ్చి తమ బాధలు తీరుస్తాడు అని నమ్మిన వూరి ప్రజలు, "ఆదేవుడు వచ్చే ముందు తమ చుట్టుప్రక్కల ప్రకృతిలో జరిగే మార్పుల వలెనే తమ రక్షకుడిని గుర్తించగలరు" అని కులపెద్ద చెప్పడంతో ఆ దేవుడికోసం నిరీక్షిస్తారు. ఆ నమ్మకానికి ప్రతి రూపమే దేవుడు. తమను కాపాడే ఆ వ్యక్తి వేష భాషలతో నిమిత్తంలేని దేవుడు.  అతనికే వారి సర్వస్య శరణాగతి. ఆ దేవుని వెన్నంటి వుండే సిద్ధూ పాత్రలో షఫిక్ నటన అపూర్వం.  చిరకాలం గుర్తుండే ఈ "మంచి పాట" సాహిత్యం, దృశ్యంతో ఇక్కడ చూడండి, వినండి.    

పూర్తి ఆడియో ఫైలు


        చిత్రం:     ఖలేజా (2010)
        రచన:     రామజోగయ్య శాస్త్రి
        సంగీతం:  మణి శర్మ
        గానం:     కారుణ్య, రమేష్

        

        ఓం నమో శివ రుద్రాయ, ఓం నమో స్థితి కంఠాయ
        ఓం నమో హర నాగాభరణాయ, ప్రణవాయ
        ఢమఢమ ఢమరుక నాదానందాయ
        ఓం నమో నిటలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ
        ఓం నమో హిమశైలావరణాయ, ప్రమధాయ
        ధిమి ధిమి తాండవ కేళీ లోలాయ
        సదా శివా సన్యాసి తాపసి, కైలాసవాసి
        నీ పాదముద్రలు మోసి పొంగి పోయినాదె పల్లె కాశి
        ఏయ్‍! సూపుల సుక్కాని దారిగా, సుక్కల తివాసి నీదిగా
        సూడ సక్కని సామి దిగినాడురా, ఏసెయ్‍రా ఊరూ, వాడా దండోరా

        ఏ రంగుల హంగుల పొడ లేదురా, ఈడు జంగమ శంకర శివుడేనురా
        నిప్పు గొంతున నిలుపు మచ్చ సాక్షిగా, నీ తాపం శాపం తీర్చే వాడేరా
        పై పైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల
        లోకాల నేలేటోడు నీకుసాయం కాకపోడు
        ఏయ్‍! నీలోనే కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు
         Om Nama Shiva Jai Jai Jai, Om Nama Shiva Jai Jai Jai
         Om Nama Shiva Groove To The Trance And Say, Trance And Say
         Sing Along Sing Shiv Shambo All The Way
         Om Namah Shiva Jai Jai Jai, Heal The World Is All We Pray
         Save Our Lives And Take Our Pain Away, Jai Jai Jai
         Sing Along Sing Shiva Shambho All The Way

        సదా శివా సన్యాసి తాపసి, కైలాసవాసి
        నీ పాదముద్రలు మోసి పొంగిపోయినాదె పల్లె కాశి
        ఏయ్‍ ఎక్కడ వీడుంటే నిండుగా, అక్కడ నేలంతా పండగా
        చుట్టు పక్కల చీకటి పెళ్లగించగా, అడుగేసాడంటా కాచే దొరలాగా
        మంచును మంటను ఒక్క తీరుగా, లెఖ్ఖ సెయ్యనె సెయ్యని శంకరయ్యగా
        ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా, మనకండాదండా వీడే నికరంగా
        సామీ! అంటే హామీ తనై ఉంటాడురా చివరంటా
        లోకాల నేలేటోడు నీకుసాయం కాకపోడు
        ఏయ్‍! నీలొనె కొలువున్నోడు నిన్నుదాటి పోనెపోడు
         
         Om Nama Shiva Jai Jai Jai, Om Nama Shiva Jai Jai Jai
         Om Nama Shiva Groove To The Trance And Say, Trance And Say
         Sing Along Sing Shiv Shambo All The Way
         Om Nama Shiva Jai Jai Jai, Heal The World Is All We Pray
         Save Our Lives And Take Our Pain Away Jai Jai Jai
         Sing Along Sing Shiv Shambo All The Way

2 కామెంట్‌లు:

Blog Indices