18, మార్చి 2012, ఆదివారం

హృద్యమైన చిత్రీకరణ గల "సుందరాంగ మరువగలేనోయ్" - సంఘం చిత్రం నుండి

1954 లో విడుదలైన చిత్రం సంఘం. కులాంతర వివాహాల నేపథ్యంలో శృంగార, హాస్య చిత్రమిది. ఇందులో రామారావు, అంజలి, వైజయంతిమాల నటించారు.  హిందీ చిత్ర రంగంలో ప్రఖాతి పొందిన అలనాటి తెలుగు-తమిళ తార వైజయంతిమాల ఈ పాటలో ఎంతో అందంగా కనిపిస్తుంది.  పాట చిత్రీకరణ చూస్తే అంత పాత చిత్రంలో కూడ సాంకేతిక విలువలు ఎంత గొప్పగా వున్నాయో తెలుస్తుంది. ఈ చిత్రానికి సంగీతం ఆర్. సుదర్శనం. సుందరాంగ మరువగలేనోయ్" పాట అలనాటి సూపర్ డూపర్ హిట్. ఈ పాటలో వైజయంతిమాల, అంజలి నటించారు.ఈ పాట రచయిత శ్రీ తోలేటి. గానం పి.సుశీల, టి.ఎస్.భగవతి.


ప.    సుందరాంగ మరువగలేనోయ్ రావేలా..
        నా అందచందములు దాచితినీకై రావేలా                   
| సుందరాంగ |
 
చ.   ముద్దు నవ్వుల మోహన కృష్ణా రావేలా                | ముద్దు |
      నవ్వులలో రాలు సరాగాలు రాగమయ రతనాలు      | నవ్వులలోనా |
      సుందరాంగ  మరువగ లేనోయ్ రావేలా
      నా అందచందములు దాచితి నీకై రావేలా

ప.   నీలికనులలో వాలు చూపుల ఆవేళా
      నను చూసి కనుసైగ చేసితివోయీ ఆవేళా             | నీలి కనులలో |
      కాలి మువ్వలా కమ్మని పాట ఆవేళా                   | కాలి మువ్వలా |
      ఆ మువ్వలలో తెలుపు అదే మనసు
      మురిసే మన కలగలుపు                                | ఆ మువ్వల |  

చ.    హృదయ వీణ తీగలు మీటీ ఆవేళా...
        అనురాగ రసములే పిండితివోయీ...రావేలా                 | హృదయ |
        మనసు నిలువదోయ్ మగువసొంతమోయ్...రావేలా..   | మనసు |
        పువ్వులు వికసించే ప్రకాశించే ప్రేమతో పల్లవించే.....      | పువ్వులు |
        సుందరాంగ మరువగలేనోయ్ రావేలా..
        నా అందచందములు దాచితినీకై రావేలా

6 కామెంట్‌లు:

  1. ఎంతో చక్కని పాట హావభావాలన్నీ చక్కగా పండిస్తారు! అలనాటి అద్భుతమయిన పాటలన్నిటినీ ఇలా పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రసజ్ఞ గారు, ధన్యవాదాలు. రసజ్ఞులయిన శ్రోతలుంటే మరింత ఉత్సాహం కలుగుతుంది.

      తొలగించండి
  2. ఈ పాట రాసిన మాస్టర్ తోలేటి గురించి ఓ మాట రాస్తే బాగుండేది.
    శ్యామ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామ్‌ గారు, సరియైన రచయిత గురించి రెండు మూడు పేర్లు చూశాను. అందువలన సందిగ్ధమ్లో పడ్డాను. మీ సూచనకు ధన్యవాదాలు. అది జోడిస్తాను.

      తొలగించండి
  3. chaala adbhutamaina pata....upload chesinanduku Thanks mama.

    రిప్లయితొలగించండి

Blog Indices