19, మార్చి 2012, సోమవారం

కల్మషం లేని మనసులు పిల్లలవి అని చెప్పే అలనాటి మంచి పాట

1966 లో విడుదలైన AVM వారి చిత్రం లేతమనసులు. ఇద్దరు కవలలైన అమ్మాయిలు తల్లితండ్రుల పంతాల మూలంగా విడిపోయి తిరిగి అందరినీ కలిపే చక్కని పిల్లల చిత్రమిది. అప్పటికి పది సంవత్సరాల వయసు గల బాల నటి బేబీ పద్మిని అద్భుతంగా ద్విపాత్రాభినయం చేసింది ఈ చిత్రంలో.  చిన్నప్పుడు ఈ సినిమా ఎన్ని సార్లు చూశానో లెఖ్ఖలేదు. ఈ  చిత్రంలో శ్రీమతి పి.సుశీల పాడిన పిల్లలూ దేవుడూ చల్లనివారే" పాట ఎన్ని రోజులయినా ఇంకా ప్రేక్షక శ్రోతల మనసులలో నిలిచి వుండే పాట. ఈ పాట సాహిత్యం శ్రీ ఆరుద్ర గారు సమకూర్చగా, సంగీతబద్ధం చేసినది శ్రీ ఎం.ఎస్.విశ్వనాథన్‌ గారు. 






చిత్రం: లేతమనసులు  
సంగీతం: MS విశ్వనాథన్ 
రచన: ఆరుద్ర,  
పాడినవారు: సుశీల 


పిల్లలూ దేవుడూ చల్లనివారే కల్లకపటమెరుగని కరుణామయులే -2 
తప్పులు మన్నించుటే దేముని సుగుణం ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం - 2  (పిల్లలూ)

పుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును - 2
ఆ పురిటికందు మనసులో  దైవముండును - 2 
వయసు పెరిగి ఈసు కలిగి మదము ఎక్కితే - 2
అంత మనిషిలోని దేముడే మాయమగునులే - 2 (పిల్లలూ)

వెలుగుతున్న సూర్యుణ్ణి మబ్బుమూయును -2
మనిషి తెలివి అనే సూర్యుణ్ణి కోపంమూయును - 2
గాలి వీచ మబ్బు తెరలు కదిలి పోవులే - 2
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే - 2 (పిల్లలూ)

పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు - 2 
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు - 2 
మాయమర్మమేమిలేని బాలలందరూ - 2 
ఈ భూమిపైన వెలసిన పుణ్యమూర్తులే -2 (పిల్లలూ)

2 కామెంట్‌లు:

Blog Indices