31, మార్చి 2012, శనివారం

సత్యనారాయణ స్వామి పూజ కు చక్కని, సులభమైన పాట దృశ్య, సాహిత్యాలతో


                  చిత్రం:     గృహ ప్రవేశం
                  రచన:     దాశరథి
                  సంగీతం: సత్యం
                  గానం:     పి.సుశీల

పల్లవి: శ్రీసత్యనారాయణుని సేవకు రారమ్మా..


మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా..
|శ్రీ సత్య|

నోచిన వారికి నోచిన వరము చూసిన వారికి చూసిన ఫలము
| శ్రీసత్య |
చరణం: స్వామిని పూజించే..చేతులె చేతులటా..


మూర్తిని దర్శించే కనులే కన్నులటా   | .... | |స్వామిని|

తన కథ వింటే ఎవ్వరికైన జన్మ తరించునటా
| శ్రీసత్య |
చరణం: యే వేళైనా..యే శుభమైనా..


 కొలిచే దైవం.. దైవం.. |.... | | యే వేళైనా |

 అన్నవరంలో వెలసిన దైవం..ప్రతి ఇంటికి దైవం.
|శ్రీ సత్య|
చరణం: అర్చన చేదామా..మనసు అర్పణ చేదామా..


 స్వామికి మదిలోనే కోవెల కడదామా.. | ఆ..ఆ.. | | అర్చన |

 పదికాలాలు పసుపుకుంకుమలు ఇమ్మని కోరేమా.
|శ్రీ సత్య|
చరణం: మంగళమనరమ్మా...జయమంగళమనరమ్మా..


 కరములు జోడించీ...శ్రీచందనమలరించీ..  | ఆ..ఆ.. | | మంగళ |

 వందనమనరే సుందరమూర్తికి వందనమనరమ్మా
|శ్రీ సత్య|


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Blog Indices