31, మార్చి 2012, శనివారం

అంతా రామమయం ఈ జగమంతా రామమయం - శ్రీ రామదాసు

2006 లో విడుదలైన శ్రీ రామదాసు చిత్రం మూడు నంది పురస్కారాలు అందుకుంది. కంచెర్ల గోపన్న/రామదాసు గా నటించిన అక్కినేని నాగార్జున కు ఉత్తమ నటుడుగా,  ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా, మరియు శ్రీ రామచంద్రరావు గారికి ఉత్తమ మేకప్‌మేన్‌ గా ఈ పురస్కారాలు లభించాయి. శ్రీ అక్కినేని పాత్రోచితంగా నటించారు. శ్రీ కీరవాణి గారి సంగీతం చక్కగా వీనుల విందుగా వుంది. రామదాసు భార్య కమలగా స్నేహ, పోకల దమ్మక్క గా సుజాత, శ్రీరామునిగా సుమన్‌,  బాగా నటించారు.  దర్శకత్వం కె.రాఘవేంద్రరావు గారు.  ఈ పాటను భద్రాచల రామదాసు వ్రాసారు. పాట చివర వచ్చే "సిరికిన్‌ జెప్పడు" అనే పద్యం పోతన రచించిన భాగవతం లోనిది.
 

శ్రీరామనవమి శుభాకాంక్షలతో

               చిత్రం:  శ్రీరామదాసు (2006)
               రచన:  రామదాసు, బమ్మెర పోతన 
               సంగీతం: కోడూరి మరకతమణి కీరవాణి
               గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

ప: అంతా రామమయం !

ఈ జగమంతా రామమయం !!

రామ రామ రామ రామ రామ రామ రామ

అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !

అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !!

అంతా రామమయం !!!


చ: అంతరంగమున ఆత్మారాముడు..

రామ రామ రామ రామ రామ రామ రామ

అనంత రూపముల వింతలు సలుపగ

రామ రామ రామ రామ రామ రామ రామ

సోమసూర్యులును, సురలు తారలును

ఆ మహాంబుధులు, అవనీజంబులు

అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !

అంతా రామమయం !!

ఓం నమో నారాయణాయ !

ఓం నమో నారాయణాయ !!

ఓం నమో నారాయణాయ !!!


చ: అండాండంబులు, పిండాండంబులు 

బ్రహ్మాండంబులు, బ్రహ్మలు మొదలుగ

నదులు, వనంబులు, నానామృగములు 

పీత కర్మములు, వేద శాస్త్రములు

అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !

రామ రామ రామ రామ రామ రామ రామ !


పద్యం: సిరికిన్ జెప్పడు..శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు

ఏ పరివారంబును జీరడు.. అభ్రక పతిన్ బంధింపడు

ఆకర్ణికాంతర ధన్విల్లము చక్క నొక్కడూ..

నివాద ప్రోద్ధీత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడూ..

గజ ప్రాణావనోత్సాహియై !

2 కామెంట్‌లు:

  1. గురువు గారు శ్రీరామనవమి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు. మీకు కూడ ఆ దశరథ రాముని కృపాకటాక్షం సిద్ధించాలని కోరుకుంటున్నాను.

      తొలగించండి

Blog Indices