2006 లో విడుదలైన శ్రీ రామదాసు చిత్రం మూడు నంది పురస్కారాలు అందుకుంది. కంచెర్ల గోపన్న/రామదాసు గా నటించిన అక్కినేని నాగార్జున కు ఉత్తమ నటుడుగా, ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా, మరియు శ్రీ రామచంద్రరావు గారికి ఉత్తమ మేకప్‌మేన్ గా ఈ పురస్కారాలు లభించాయి. శ్రీ అక్కినేని పాత్రోచితంగా నటించారు. శ్రీ కీరవాణి గారి సంగీతం చక్కగా వీనుల విందుగా వుంది. రామదాసు భార్య కమలగా స్నేహ, పోకల దమ్మక్క గా సుజాత, శ్రీరామునిగా సుమన్, బాగా నటించారు. దర్శకత్వం కె.రాఘవేంద్రరావు గారు. ఈ పాటను భద్రాచల రామదాసు వ్రాసారు. పాట చివర వచ్చే "సిరికిన్ జెప్పడు" అనే పద్యం పోతన రచించిన భాగవతం లోనిది.
చిత్రం: శ్రీరామదాసు (2006)
రచన: రామదాసు, బమ్మెర పోతన
సంగీతం: కోడూరి మరకతమణి కీరవాణి
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
శ్రీరామనవమి శుభాకాంక్షలతో
చిత్రం: శ్రీరామదాసు (2006)
రచన: రామదాసు, బమ్మెర పోతన
సంగీతం: కోడూరి మరకతమణి కీరవాణి
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
| ప: | అంతా రామమయం ! |
| ఈ జగమంతా రామమయం !! | |
| రామ రామ రామ రామ రామ రామ రామ | |
| అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం ! | |
| అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !! | |
| అంతా రామమయం !!! | |
| చ: | అంతరంగమున ఆత్మారాముడు.. |
| రామ రామ రామ రామ రామ రామ రామ | |
| అనంత రూపముల వింతలు సలుపగ | |
| రామ రామ రామ రామ రామ రామ రామ | |
| సోమసూర్యులును, సురలు తారలును | |
| ఆ మహాంబుధులు, అవనీజంబులు | |
| అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం ! | |
| అంతా రామమయం !! | |
| ఓం నమో నారాయణాయ ! | |
| ఓం నమో నారాయణాయ !! | |
| ఓం నమో నారాయణాయ !!! | |
| చ: | అండాండంబులు, పిండాండంబులు |
| బ్రహ్మాండంబులు, బ్రహ్మలు మొదలుగ | |
| నదులు, వనంబులు, నానామృగములు | |
| పీత కర్మములు, వేద శాస్త్రములు | |
| అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం ! | |
| రామ రామ రామ రామ రామ రామ రామ ! | |
| పద్యం: | సిరికిన్ జెప్పడు..శంఖ చక్ర యుగమున్ చేదోయి సంధింపడు |
| ఏ పరివారంబును జీరడు.. అభ్రక పతిన్ బంధింపడు | |
| ఆకర్ణికాంతర ధన్విల్లము చక్క నొక్కడూ.. | |
| నివాద ప్రోద్ధీత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడూ.. | |
| గజ ప్రాణావనోత్సాహియై ! |







గురువు గారు శ్రీరామనవమి శుభాకాంక్షలు
రిప్లయితొలగించండిధన్యవాదాలు. మీకు కూడ ఆ దశరథ రాముని కృపాకటాక్షం సిద్ధించాలని కోరుకుంటున్నాను.
తొలగించండి